Telugu Global
Cinema & Entertainment

Takkar Release Date: మరో సినిమా రెడీ చేసిన పీపుల్ మీడియా

Siddharth's Takkar movie Release Date: సిద్దార్థ్ టక్కర్ మూవీ విడుదలకు సిద్ధమైంది. పీపుల్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది.

Takkar Release Date: మరో సినిమా రెడీ చేసిన పీపుల్ మీడియా
X

నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్దార్థ్, తాజాగా టక్కర్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'టక్కర్' టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్ధార్థ్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటలకు కూడా ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ స్వభావాన్ని తెలియజేసేలా, ప్రకృతి అందాల నడుమ చిత్రీకరించిన 'కయ్యాలే' పాట కట్టిపడేసింది. హీరోహీరోయిన్ల ఘాటు ప్రేమను తెలిపేలా సాగిన 'పెదవులు వీడి మౌనం' పాట మనసు దోచేసింది. ఇలా పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది.

ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.



First Published:  20 May 2023 11:29 AM GMT
Next Story