Telugu Global
Cinema & Entertainment

SPARK Movie | సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్

SPARK movie - స్పార్క్ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజైంది. సిద్ శ్రీరామ్ ఈ పాట ఆలపించాడు.

SPARK Movie | సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్
X

విక్రాంత్‌, మెహ‌రీన్, రుక్స‌ర్ థిల్లాన్ హీరోహీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న మూవీ ‘స్పార్క్’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు విక్రాంత్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. డైరెక్షన్ కూడా చేశాడు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాను నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా 'స్పార్క్'ను తెరకెక్కించారు.

మలయాళం బ్లాక్ బస్టర్ 'హృదయం', విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాల ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ ‘స్పార్క్’కు సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు సినిమాలో మొదటి పాట 'ఏమా అందం'ను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

విశాఖలోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేశారు. హేషం అందించిన అద్భుతమైన బాణీకి అనంత శ్రీరామ్ సాహిత్యం, సిద్ శ్రీరామ్ గాత్రం తోడు కావడంతో సాంగ్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. హీరో విక్రాంత్, హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ మీద ఈ పాటను తెరకెక్కించారు. విజువలైజేషన్ కూడా ప్లజెంట్‌గా ఉంది.

ఆల్రెడీ రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. నవంబర్ 17న ఈ సినిమా విడుదల చేయనున్నారు. ‘స్పార్క్’ మూవీ షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

First Published:  13 Sep 2023 5:29 PM GMT
Next Story