Telugu Global
Cinema & Entertainment

Samantha-Shruti Haasan | సమంత సినిమాను ఎగరేసుకుపోయిన శృతిహాసన్

Shruti Haasan grabs Samantha's International Movie - సమంత చేయాలనుకున్న ఓ సినిమా ఆఫర్ ను శృతిహాసన్ ఎగరేసుకుపోయింది. ఆ వివరాలు మీకోసం...

Samantha-Shruti Haasan | సమంత సినిమాను ఎగరేసుకుపోయిన శృతిహాసన్
X

ఆ మధ్య సమంత అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమా టైమ్ లో ఆమె మయొసైటిస్ బారిన పడింది. ఆ తర్వాత ఏకంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఫిజికల్ ఫిట్ నెస్ పై పూర్తిగా దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఆమె కొన్ని సినిమా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా మరో ఛాన్స్ మిస్సయింది.

దాదాపు మూడేళ్ల కిందటే ఓ ఇంటర్నేషనల్ సినిమా నటించడానికి అంగీకరించింది సమంత. దాని పేరు చెన్నై స్టోరీ. ది ఎరేంజ్ మెంట్స్ ఆఫ్ ఎ లవ్ అనే పుస్తకం ఆధారంగా ఆ సినిమా రానుంది. చెన్నై, బ్రిటన్ లో ఈ సినిమా కథ నడుస్తుంది.

ఈ అంతర్జాతీయ చిత్రంలో నటించడానికి అప్పట్లో సమంత అంగీకరించింది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో, ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. సమంత స్థానంలో శృతిహాసన్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది.

ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది సమంత. కెరీర్ లో తొలిసారి అంతర్జాతీయ స్థాయికి వెళ్లొచ్చని ఆశపడింది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆ ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చింది. ఓ లేడీ డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథతో రాబోతోంది చెన్నై స్టోరీ.

First Published:  25 Jan 2024 5:15 PM GMT
Next Story