Telugu Global
Cinema & Entertainment

Shriya Reddy | సలార్ కంటే ఓజీ పెద్దదంటోన్న శ్రియా రెడ్డి

Shriya Reddy - సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది శ్రియారెడ్డి. అయితే ఈ సినిమా కంటే పవన్ సినిమా పెద్దదంటోంది.

Shriya Reddy | సలార్ కంటే ఓజీ పెద్దదంటోన్న శ్రియా రెడ్డి
X

సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించింది నటి శ్రియా నటి. ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు ఆమె పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో కూడా చేస్తోంది. సలార్ సినిమా కంటే ఓజీ చాలా పెద్ద సినిమా అంటోంది శ్రియా రెడ్డి.

"పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విషయానికి వస్తే అద్భుతమైన స్క్రిప్ట్ అనే చెబుతాను. ఎమోషనల్ రోలర్ కోస్టర్ మూవీ. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి వంటి గొప్ప నటీనటులు అలరించబోతున్నారు. ఓజీ చిత్రంలో నేను నెగటివ్ రోల్ చేయటం లేదు. సినిమాలో నాకు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రిలేషన్, పాత్ర గురించి అప్పుడే చెప్పను. సలార్, ఓజీల్లో చాలా డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాను. సలార్ కంటే ఓజీ ప్రపంచం పెద్దది."

ఓజీలో తను చేస్తున్న పాత్ర చాలా పెద్ద పాత్ర అని, అది తనకు లైఫ్ టైమ్ గుర్తింపు తెచ్చిపెడుతుందని చెబుతోంది శ్రియా రెడ్డి. బహుశా, ఓజీ సినిమా రిలీజ్ తర్వాత తను రిటైర్ అయిపోతానేమో అంటూ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చింది.

ఇక సలార్ విషయానికొస్తే.. పార్ట్-1లో కంటే సలార్ పార్ట్-2లో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని చెబుతోంది. ఓజీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత సలార్ పార్ట్-2 రిలీజ్ అవుతుందని, ఓజీలో తన పాత్రను చూసిన తర్వాత, సలార్ లో తను పోషించిన రాధా రమ పాత్ర ప్రేక్షకులకు చిన్నదిగా కనిపిస్తుందని చెబుతోంది శ్రియారెడ్డి.

First Published:  27 Dec 2023 5:01 PM GMT
Next Story