Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | మహేష్ మూవీ నుంచి మరింత క్లారిటీ

Guntur Kaaram - సంక్రాంతికి విడుదలకానుంది గుంటూరు కారం సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది.

Guntur Kaaram | మహేష్ మూవీ నుంచి మరింత క్లారిటీ
X

మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరుకారం. ఈ సినిమాపై ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. తాజాగా మరో పుకారు మొదలైంది. సినిమాకు సంబంధించి తమన్ కంపోజ్ చేసిన మాస్ సాంగ్ మహేష్ బాబుకు నచ్చలేదట. ఆ సాంగ్ ను మళ్లీ మార్చమని చెప్పాడట. అప్పటివరకు షూటింగ్ రానని చెప్పాడట

దీనిపై యూనిట్ స్పందించింది. పుకార్లను ఖండించింది. గుంటూరుకారంలో 4 సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉన్నాయంట. వీటిలో 3 సాంగ్స్, బిట్ సాంగ్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయిందంట. మిగిలిన ఒక్క పాటను 21వ తేదీ నుంచి షూట్ చేస్తారట. కాబట్టి సాంగ్ మార్చమంటూ వచ్చిన పుకార్లలో నిజం లేదని ప్రకటించాడు నిర్మాత నాగవంశీ.

అయితే నాగవంశీ ఖండిస్తూ ప్రకటన ఇస్తే, అది జనాల్లోకి మరో విధంగా వెళ్లింది. విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైమ్ ఉండగా, ఇంకా ఓ సాంగ్ షూటింగ్ పూర్తిచేయలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లూ ఏం చేశారని అడుగుతున్నారు. మిగిలిన ఆ ఒక్క పాటపై మహేష్ అభ్యంతరం వ్యక్తం చేసి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు.

ఏదేమైనా మిగిలిన పాటను 3 రోజుల్లో పూర్తి చేసి, జనవరి 1 నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  18 Dec 2023 3:32 PM GMT
Next Story