Telugu Global
Cinema & Entertainment

ఆ వార్తలు చూసి షాకయ్యా!

జయం రవి, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన 'బ్రదర్‌'మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఫొటో నెట్టింట వైరల్‌

ఆ వార్తలు చూసి షాకయ్యా!
X

జయంరవి, ప్రియాంక మోహన్‌ దండలు వేసుకుని ఉన్న ఓ ఫొటో చర్చనీయాంశంగా మారింది. జయం రవితో నిశ్చితార్థం అంటూ వార్తలు వచ్చాయి. ఈ జంటకు నిశ్చితార్థమైందని పలువురు మాట్లాడుకున్నారు. జయం రవి, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన మూవీ 'బ్రదర్‌'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల వార్తలు రావడంతో ప్రియాంక మోహన్‌ స్పందించారు. అందులో నిజం లేదన్నారు. ఆ వార్తలు చూసి షాకయ్యాను అన్నారు.

జయం రవి, నేను కలిసి 'బ్రదర్‌' మూవీ కోసం పనిచేశాం. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఫొటో విడుదల చేసింది. అందులో మేమిద్దరం మెడలో పూలదండలు వేసుకుని ఉంటాం. దాంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన చాలామంది మాకు నిశ్చితార్థం అయిందనుకున్నారు. షూటింగ్స్‌లతో బిజీ ఉండటంతో ఆ విషయం నా దృష్టికి రాలేదు. ఆ టైమ్‌లో అది నిజమేనని నమ్మిన టాలీవుడ్‌లోని నా ఫ్రెండ్స్‌ వరుగా కాల్స్‌ చేశారు. కంగ్రాట్స్‌ చెప్పారు. ఏం జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. పూర్తి విషయం తెలుసుకుని అది సినిమాలోని స్టిల్‌ మాత్రమేనని చెప్పాను. ఆ తర్వాత మా మూవీ సిబ్బందిని తిటుకున్నాం. వేరే ఫొటో విడుదల చేయవచ్చు కదా ,ఇది ఎందుకు చేశారనుకున్నాని ప్రియాంక మోహన్‌ తెలిపారు. అలాగే ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.

మరోవైపు జయం రవి తన సతీమణి ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నాని సెప్టెంబర్‌లో ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటన తర్వాత ఆయనను విమర్శిస్తూ చాలామంది వ్యాఖ్యలు చేశారు. ఆయన భార్య ఆర్తి కూడా స్పందిస్తూ తనకు తెలియకుండానే, తన అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి ఆయన బహిరంగంగా ప్రకటించారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఇటీవల జయం రవి మాట్లాడుతూ.. ఆమె వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో చర్చించామన్నారు. అలాగే గాయనితో తాను రిలేషన్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. జయం రవి విడాకాల ఉదంతంపై చర్చ కొనసాగుతుండగానే... సినిమా ప్రమోషన్‌లో భాగంగా జయం రవి, ప్రియాంక మోహన్‌ దండలు వేసుకుని ఉన్న ఫొటో బైటికి వచ్చి చర్చనీయాంశంగా మారింది.

First Published:  26 Oct 2024 4:26 AM GMT
Next Story