Telugu Global
Cinema & Entertainment

Captain Miller: ధనుష్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్

Captain Miller: ధనుష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించబోతున్నాడు.

Captain Miller: ధనుష్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్
X

నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ "కెప్టెన్ మిల్లర్". 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా వస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు.

భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్టులోకి వచ్చిచేరారు. కెప్టెన్ మిల్లర్ లో శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రకటిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ చిత్రంలో ధనుష్ కి జోడిగా ఇద్దరు హీరోయిన్లు ప్రియాంక మోహన్, నివేదిత సతీష్ నటిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నాడు.




First Published:  10 Dec 2022 11:52 AM GMT
Next Story