Telugu Global
Cinema & Entertainment

Ghost | తెలుగు తెరపైకి మరో ఘోస్ట్

GHOST movie - ఇది నాగార్జున నటించిన ఘోస్ట్ కాదు. కన్నడ స్టార్ నటించిన ఘోస్ట్ ఇది. తెలుగులో విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా.

Ghost | తెలుగు తెరపైకి మరో ఘోస్ట్
X

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన యాక్షన్ మూవీ 'ఘోస్ట్'. కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్ల తో దూసుకెళ్తోంది ఈ సినిమా. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఘోస్ట్, తొలి రోజే మంచి రివ్యూస్ తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కించాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని నిర్మించారు.

ఘోస్ట్ నవంబర్ 4న ఆంధ్రా, తెలంగాణలో తెలుగులో విడుదలకు సిద్ధం అవుతోంది. జక్కన్న రాజమౌళి విడుదల చేసిన ఘోస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ జైలర్ లో పవర్ ఫుల్ స్పెషల్ రోల్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శివరాజ్ కుమార్, పూర్తి స్థాయిలో యాక్షన్ హీరోగా నటించిన ఘోస్ట్ పట్ల తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ అందించగా... పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందించాడు.

తెలుగులో ఇప్పటికే నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఆ స్ట్రయిట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడీ డబ్బింగ్ ఘోస్ట్, తెలుగు తెరపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

First Published:  28 Oct 2023 5:18 PM GMT
Next Story