Telugu Global
Cinema & Entertainment

Kushi Movie | రెండేళ్ల కిందట రాసుకున్న కథ ఇది

Kushi Movie - ఖుషి మూవీ స్టోరీని రెండేళ్ల కిందటే రాశానంటున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇంకా ఏం చెబుతున్నాడంటే..!

Kushi Movie | రెండేళ్ల కిందట రాసుకున్న కథ ఇది
X

ఖుషి సినిమాను రెండేళ్ల కిందటే రాసుకున్నానని స్పష్టం చేశాడు శివ నిర్వాణ. కరోనా టైమ్ లో రాసుకున్న ఆ కథకు దాదాపు ఏడాది పాటు మార్పుచేర్పులు చేశానని వెల్లడించాడు. దేవుడిపై నమ్మకం, కర్మసిద్దాంతం మధ్యలో ఓ ప్రేమకథ చెబితే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ఖుషి సినిమా వచ్చిందంటున్నాడు.

"దేవుడు, నమ్మకాలు, కర్మ సిద్ధాంతం అనేది మన దేశంలో వందల ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఈ నేపథ్యంతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఇప్పుడున్న సొసైటీకి చెప్పాలనుకుని రెండేళ్ల కిందట ఖుషి కథ రాసుకున్నాను. ఆ పాయింట్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఉదయం షో యూత్ తో మొదలై మ్యాట్నీకి కపుల్స్ వెళ్తున్నారు. ఫస్ట్ షో కు ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇలా మరికొన్ని వారాల పాటు మా ఖుషి థియేటర్స్ లో ఫ్యామిలీస్ తో కళకళలాడాలని కోరుకుంటున్నా"

క్లయిమాక్స్ క్లిక్ అయిన సినిమా ఫ్లాప్ అయినట్టు చరిత్రలో లేదంటున్నాడు శివ నిర్వాణ. తమ సినిమా క్లయిమాక్స్ కూడా చాలా బాగా వచ్చిందని, కాబట్టి ఫ్లాప్ అయ్యే సమస్యలేదని చెబుతున్నాడు.

"లాస్ట్ అరగంట ప్రేక్షకుల్ని ఒక ఎమోషనల్ మూడ్ లోకి తీసుకెళ్లాలని ముందే అనుకున్నాం. అది బాగా వర్కవుట్ అయి ప్రేక్షకులకు రీచ్ ‌అవడం సంతోషంగా ఉంది. సిద్ధాంతాలు, శాస్త్రాలు వేరు అవ్వొచ్చు కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ఈ సినిమాలో చెప్పాం. క్లైమాక్స్ ముందు వరకు క్యారెక్టర్స్ ను సస్టెయిన్ చేయకపోతే ముగింపు అంత బాగా రిసీవ్ చేసుకునేవారు కాదు. అంత సేపు ఎమోషన్ క్లైమాక్స్ చూశారంటే ప్రేక్షకులు అక్కడే సినిమాతో కనెక్ట్ అయినట్లుగా భావిస్తాను. క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు"

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. హేషమ్ అందించిన సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

First Published:  2 Sep 2023 8:46 AM GMT
Next Story