Telugu Global
Cinema & Entertainment

Kushi Movie | ఇది లవ్ ఫెయిల్యూర్ మూవీ కాదు

Kushi Movie - ఖుషి సినిమాకు స్ఫూర్తి ఎవరనేది బయటపెట్టాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కాదంటున్నాడు.

Kushi Movie | ఇది లవ్ ఫెయిల్యూర్ మూవీ కాదు
X

ఇంతకుముందు నిన్ను కోరి, మజిలీ లాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ చూపించాడు శివ నిర్వాణ. ఖుషి సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని చెబుతున్నారు చాలామంది. కానీ వాటిని ఖండిస్తున్నాడు ఈ దర్శకుడు.

"నేను గతంలో తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీలో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. కానీ ఈసారి ఒక ఎంటర్ టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా సరదాగా ఉండే పర్సన్ ని. ఈ సినిమాకు సరదా అని, మరికొన్ని టైటిల్స్ అనుకున్నాను. కానీ విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ఖుషి టైటిల్ ఫిక్స్ చేశాం."

ఇలా ఖుషి స్టోరీని లైట్ గా రివీల్ చేశాడు శివ నిర్వాణ. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ను ట్రయిలర్ లో చెప్పలేదని, ప్రస్తుతం సొసైటీలో చాలామంది ఫేస్ చేస్తున్న ఓ సునిశితమైన పాయింట్ ను చెప్పానని అంటున్నాడు.

"ఖుషి సినిమాలో మణిరత్నం తీసిన ‘సఖి’ లాంటి పాయింట్ ఉంటుందనే వార్తలూ వచ్చాయి కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ నేను చెప్పిన పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్ లో మేము చూపించలేదు. థియేటర్ లో చూడాలి."

ఖుషి సినిమాలో హీరోహీరోయిన్ పాత్రలు బ్యాలెన్స్ గా ఉంటాయట. ఎవ్వర్నీ ఎక్కువగా, తక్కువగా చూపించలేదంటున్నాడు దర్శకుడు. ఈ ప్రాజెక్టులో ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నాడట. ఫిమేల్ క్యారెక్టర్ కూడా బలంగా ఉండడంతో సమంత అయితే బాగుంటుందని ఫీల్ అయ్యాడట.

First Published:  29 Aug 2023 5:36 PM GMT
Next Story