Telugu Global
Cinema & Entertainment

ప్రిన్స్ ట్రయిలర్ ఎలా ఉందంటే..!

శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న స్ట్రయిట్ తెలుగు మూవీ ప్రిన్స్. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేశారు.

ప్రిన్స్ ట్రయిలర్ ఎలా ఉందంటే..!
X

శివ కార్తికేయన్ హీరోగా, అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న సినిమా 'ప్రిన్స్'. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్టోబర్ 25 దీపావళితో రాబోతున్న లాంగ్ వీకెండ్‌ను ప్రిన్స్ క్యాష్ చేసుకోనుంది. తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశాడు.

ఒక ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయి ప్రేమ కథ, వారి ప్రేమ కథలోని సమస్యలతో హిలేరియస్ గా ఉంది ట్రైలర్. శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క ఇద్దరూ ఒక పాఠశాలలో పని చేస్తుంటారు. శివకార్తికేయన్ తండ్రిగా సత్యరాజ్ ఒక సంఘ సంస్కర్త, తను ప్రేమకి ఆమోదాన్ని తెలిపినప్పటికీ, ప్రేమకథకు మరికొన్ని అడ్డంకులు ఉన్నాయి.

అనుదీప్ కెవి విభిన్నమైన రొమాంటిక్ కామెడీని ఎంచుకుని, దానిని తనదైన శైలిలో ప్రజంట్ చేశాడు. ట్రైలర్‌లో దాదాపు ప్రతి సన్నివేశంలో మంచి హాస్యం ఉంది. శివకార్తికేయన్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ పాత్ర కూడా చాలా వినోదాన్ని పంచింది. శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క ల జోడి ఫ్రెష్ గా కనిపించింది.

సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, సంగీత దర్శకుడు థమన్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.

సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



First Published:  10 Oct 2022 4:39 AM GMT
Next Story