Telugu Global
Cinema & Entertainment

లాంగ్ వీకెండ్ పై కన్నేసిన 'ప్రిన్స్'

తొలిసారి తెలుగులో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రిన్స్. ఈ మూవీకి విడుదల తేదీని ఫిక్స్ చేశారు.

లాంగ్ వీకెండ్ పై కన్నేసిన ప్రిన్స్
X

తమిళ హీరో శివ కార్తికేయన్, నేరుగా తెలుగులో చేస్తున్న సినిమా ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో శివకార్తికేయన్ సరసన మారియా రాబోష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.

తాజాగా అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 21న ప్రిన్స్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో శివకార్తికేయన్ హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.

దీపావళి కానుకగా థియేటర్లలోకి వస్తోంది ప్రిన్స్. దీపావళితో పాటు వచ్చిన లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేస్తూ, ఈ తేదీని ఫిక్స్ చేశారు. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ చేశారు.

సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, తమన్ సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు.

First Published:  5 Oct 2022 6:48 AM GMT
Next Story