Telugu Global
Cinema & Entertainment

Shiva Karthikeyan | సంక్రాంతి బరిలో శివకార్తికేయన్

Shiva Karthikeyan - శివకార్తికేయన్ తాజా చిత్రం అయలాన్. రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారు.

Shiva Karthikeyan | సంక్రాంతి బరిలో శివకార్తికేయన్
X

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్'. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్, రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'అయలాన్' అంటే 'ఏలియన్' అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి.

'అయలాన్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపాడు. అతి త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈ సినిమా టైమ్ లో చాలా కష్టాలు ఎదుర్కొన్నారట నిర్మాతలు. అయితే ఆ కష్టాలేంటనేది వాళ్లు చెప్పలేదు. సినిమా లేట్ అవ్వడానికి అదే కారణమని తెలిపిన మేకర్స్.. అన్ని కష్టాలు దాటి సంక్రాంతికి వస్తున్నట్టు వెల్లడించారు. అందరి అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందంటున్నారు.

సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్, అందులోనూ ఏలియన్స్ నేపథ్యంలో తీసే సినిమాలు అంటే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం చాలా కష్టపడ్డారట. దీనికోసమే డబ్బు, టైమ్ ఎక్కువ ఖర్చు పెట్టారట. 'అయలాన్'లో 4500కు పైగా విజువల్ ఎఫెక్ట్ షాట్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా ఇదేనని యూనిట్ అంటోంది.

పలు సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఫాంటమ్ కంపెనీ 'అయలాన్'లో ఏలియన్ సహా ఇతర గ్రాఫిక్స్ వర్క్ చేసింది. పాన్ ఇండియా సినిమాలో ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటం ఇదే తొలిసారి. ఇషా కొప్పికర్, సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.




First Published:  24 Sep 2023 5:18 PM GMT
Next Story