Telugu Global
Cinema & Entertainment

మహావీరుడిగా మారిన శివకార్తికేయన్

డాక్టర్, కాలేజ్ డాన్ సినిమాల తర్వాత శివకార్తికేయన్ నుంచి మరో సినిమా వస్తోంది. దీని పేరు మహావీరుడు.

మహావీరుడిగా మారిన శివకార్తికేయన్
X

శివకార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా వస్తోంది. ఈ సినిమాకు మావీరన్ అనే టైటిల్ పెట్టారు. తెలుగులో ఈ సినిమాకు మహావీరుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించి, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనికి ప్రతిగా శివకార్తికేయన్, మహేష్ కు థ్యాంక్స్ చెప్పాడు.

విడుదల చేసిన వీడియో గ్లింప్స్ బాగుంది. శివకార్తికేయన్‌ను తాళ్లతో కట్టగా ..ఆయన అలా కట్లు తోనే విలన్స్ ని స్టయిలీష్ గా కొట్టడం చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఆలోచన చాలా కొత్తగా ఉండగా , క్యారికేచర్ స్టిల్ తో టైటిల్ రివీల్ కావడం మరింత రీఫ్రెషింగ్ గా ఉంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో శివకార్తికేయన్, అలనాటి బ్రూస్ లీ ఐకానికి పోజులో కనిపించి ఆకర్షించాడు.

శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

శివకార్తికేయన్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మార్కెట్ పెరిగింది. అతడు నటించిన డాక్టర్, కాలేజ్ డాన్ సినిమాలు ఇక్కడ కూడా హిట్టయ్యాయి. అంతేకాదు, ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేస్తున్నాడు ఈ హీరో. ఈ నేపథ్యంలో.. మహావీరుడు సినిమాపై టాలీవుడ్ లో కూడా బజ్ పెరిగింది.



First Published:  16 July 2022 5:00 AM GMT
Next Story