Telugu Global
Cinema & Entertainment

Shiva Kandukuri: భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్ రిలీజ్

Shiva Kandukuri's Bhutaddam Bhaskar Narayan - శివ కందుకూరి కొత్త సినిమా భూతద్ధం భాస్కర్ నారాయణ. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. అదెలా ఉందో చూద్దాం..

Shiva Kandukuri: భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్ రిలీజ్
X

విభిన్నమైన చిత్రాల్లో న‌టించే హీరో శివ కందుకూరి. ఇప్పుడీ నటుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "భూతద్ధం భాస్కర్‌ నారాయణ".

ఇదివరకే రిలీజైన మోషన్ పోస్టర్ తో అంచనాలను పెంచింది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా ఉంది.

సినిమాలో శివ కందుకూరి డిటెక్టీవ్ గా కనిపించనున్నాడు. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ టీజర్ లో శివ కందుకూరి ని గమనించవచ్చు. మంచి కథతో పాటు ఇంట్రెస్టింగ్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ ను ప్రెజెంట్ చేశారు మేకర్స్.

ఈ టీజర్ తో సినిమా కథ, జానర్ పై ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. ఇదివరకే ఈ చిత్రం గురించి మేకర్స్ ప్రస్తావిస్తూ ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి ఎడ్జ్‌ ఆఫ్‌ద సీట్‌గా ఉంటుందని తెలిపారు. మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు భాస్కర్ నారాయణ.



First Published:  28 Jan 2023 2:55 PM GMT
Next Story