Telugu Global
Cinema & Entertainment

మరో సినిమాతో ముందుకురాబోతున్న శర్వానంద్

ఒకే ఒక జీవితం.. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం. ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.

మరో సినిమాతో ముందుకురాబోతున్న శర్వానంద్
X

ఈమధ్య శర్వానంద్ టైమ్ బాగాలేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతోంది. థియేట్రికల్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. భారీ అంచనాల మధ్య మహాసముద్రం చేస్తే ఫ్లాప్ అయింది. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ ను పెట్టి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే ఫ్యామిలీ సినిమా చేస్తే, కనీసం కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరించలేదు. దీంతో గ్యాప్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. అదే ఒకే ఒక జీవితం.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు, అమ్మ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో శర్వానంద్ కు తల్లిగా అమల నటించింది. రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, అలీ లాంటి నటులున్నారు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి చిత్ర యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తమిళంలో ఈ సినిమా 'కణం' పేరుతో విడుదల కానుంది.

ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ కెమెరాను అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా , సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, అమల అక్కినేని, నాజర్, రీతూ వర్మ రెండు భాషల్లోనూ తమ పాత్రలని పోషించారు.

First Published:  9 Aug 2022 4:14 PM GMT
Next Story