Telugu Global
Cinema & Entertainment

Sharwanand | కొత్త సినిమా స్టార్ట్ చేసిన శర్వానంద్

Sharwanand - హీరో శర్వానంద్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆ సినిమా వస్తోంది.

Sharwanand | కొత్త సినిమా స్టార్ట్ చేసిన శర్వానంద్
X

ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ మూవీకి మనమే అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాతో పాటు ఇప్పుడు మరో కొత్త సినిమా లాంచ్ చేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ దర్శకుడు అభిలాష్ కంకరతో సినిమా స్టార్ట్ చేశాడు శర్వా.

అభిలాష్ కంకర 'మా నాన్న సూపర్‌హీరో' తో డెబ్యు ఇచ్చాడు. శర్వాతో సినిమా అతని సెకండ్ డైరెక్షన్ వెంచర్. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు..మూడు పెద్ద బ్లాక్‌బస్టర్‌లను అందించిన శర్వానంద్‌కి యూవీ క్రియేషన్స్ లక్కీ బ్యానర్ కింద లెక్క.

శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ఈ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పోస్టర్ మట్టి రోడ్ పై రేసులో బైక్ రైడర్‌లను చూపిస్తోంది. రేసులో తన ప్రత్యర్థులను అధిగమించేందుకు ఎత్తుగా ఎగురుతున్న రైడర్ జాకెట్‌పై S36ని మనం చూడవచ్చు. పోస్టర్ సూచించినట్లుగా, ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా ఉండబోతోంది, ఇందులో హీరో బైక్ రైడర్‌.

సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సమర్పకులు విక్రమ్, హీరో హీరోయిన్స్ పై క్లాప్ కొట్టారు. హీరో శర్వానంద్, దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీత దర్శకుడు.

First Published:  6 March 2024 5:09 PM GMT
Next Story