Telugu Global
Cinema & Entertainment

Sharwanand: పెళ్లి కబురు మోసుకొస్తున్న శర్వానంద్?

Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు శర్వానంద్. ఇప్పుడీ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. త్వరలోనే పెళ్లి ప్రకటన చేస్తాడంట

Sharwanand: పెళ్లి కబురు మోసుకొస్తున్న శర్వానంద్?
X

టాలీవుడ్ లో మరో హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే రానా, నితిన్, నాగశౌర్య లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ జాబితాలోకి శర్వానంద్ కూడా చేరబోతున్నాడు. ఈ ఏడాది శర్వానంద్ పెళ్లి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఓ అమ్మాయిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడట శర్వానంద్. ఆమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంట. కొన్నాళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. ఆమెనే శర్వానంద్ పెళ్లి చేసుకుంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

38 ఏళ్ల శర్వానంద్, పదేళ్లుగా పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. మీడియా ఎదురైన ప్రతిసారి తన పెళ్లి మేటర్ ను స్కిప్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా బాలయ్యకు ఇచ్చిన 'అన్ స్టాపబుల్' ఇంటర్య్వూలో కూడా తప్పించుకున్నాడు. ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాత తను చేసుకుంటానంటూ మేటర్ సైడ్ చేశాడు.

అయితే శర్వా మనసులో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉందనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతానికి శర్వానంద్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

First Published:  5 Jan 2023 5:30 AM GMT
Next Story