Telugu Global
Cinema & Entertainment

డాక్టర్ ఇలాంటి సినిమాలు చేయొద్దన్నాడు

ఒకే ఒక జీవితంలో తను పోషించిన ఆది పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో బయటపెట్టాడు శర్వానంద్. ఆ క్యారెక్టర్ కోసం అమెరికా వెళ్లి కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.

డాక్టర్ ఇలాంటి సినిమాలు చేయొద్దన్నాడు
X

ఒకే ఒక జీవితం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు హీరో శర్వానంద్. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని, ఫస్ట్ నెరేషన్ నుంచే తను నమ్మానని, తన నమ్మకమే నిజమైందని చెప్పుకొచ్చాడు. అయితే ఇకపై ఇలాంటి సినిమాలు చేయొద్దని డాక్టర్ తనకు సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు ఈ హీరో. ఇంతకీ ఏం జరిగింది?

"ఒకే ఒక జీవితం షూటింగ్ కు వెళ్తున్నానంటే మా ఇంట్లో అందరికీ టెన్షన్ వచ్చేది. ఏ మైండ్ సెట్ తో వెనక్కి వస్తానా అని భయపడేవాళ్లు. ఈ సినిమా షూట్ టైమ్ లో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. కొన్ని సీన్లు చేయలేకపోయాను. షూటింగ్ కూడా రద్దు చేసి అమెరికా వెళ్లిపోయాను. ఓ షెడ్యూల్ మొత్తం చేయలేకపోయాను. ఈ కథ నాపై అంత ప్రభావం చూపింది. అక్కడ కౌన్సిలింగ్ తీసుకొని, మళ్లీ వచ్చి నటించాను. డాక్టర్ అయితే ఇకపై ఇలాంటి సినిమాలు మళ్లీ చేయొద్దని చెప్పాడు."

ఇలా అసలు మేటర్ బయటపెట్టాడు శర్వానంద్. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ కథలో శర్వా లీనమైపోయాడనే విషయాన్ని దర్శకుడు కూడా బయటపెట్టాడు. సినిమాలో చాలా చోట్ల శర్వానంద్ సహజంగా ఏడ్చాడని, అందుకే ఆ సన్నివేశాలు అంత బాగా వచ్చాయని అన్నాడు.

First Published:  11 Sep 2022 7:38 AM GMT
Next Story