Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన శంకర్

రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాపై దర్శకుడు శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఇండియన్-2 చేస్తున్న కారణంగా చరణ్ సినిమా ఆగిపోయినట్టు కాదని తెలిపాడు

రామ్ చరణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన శంకర్
X

నిన్నట్నుంచి ఇండియన్-2 సినిమా స్టార్ట్ చేశాడు శంకర్. కమల్ హాసన్ హీరోగా చెన్నైలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఆ సినిమా ఇలా మొదలైందో లేదో చరణ్ తో చేస్తున్న సినిమాపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరికొన్నాళ్ల పాటు చరణ్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదని, కనీసం 2 నెలల పాటు ఈ సినిమాను పక్కన పెట్టే అవకాశం ఉందంటూ కథనాలు వచ్చాయి. దీనిపై స్వయంగా దర్శకుడు శంకర్ క్లారిటీ ఇచ్చాడు.

"అందరికీ నమస్కారం.. ఇండియన్2, రామ్ చరణ్ మూవీ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతాయి. వచ్చేనెల మొదటి వారంలో రామ్ చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ ఉంటుంది. హైదరాబాద్, వైజాగ్ లో ఆ షెడ్యూల్ జరుగుతుంది."

ఇలా రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు శంకర్. ఓవైపు కమల్ తో ఇండియన్-2 చేస్తూనే, మరోవైపు రామ్ చరణ్ సినిమాను కంప్లీట్ చేస్తానని స్పష్టంగా ప్రకటించాడు. దీంతో చరణ్-శంకర్ సినిమాపై ముసురుకున్న అనుమానాలు పటాపంచలయ్యాయి.

దిల్ రాజు దర్శకత్వంలో వస్తోంది రామ్ చరణ్ సినిమా. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  25 Aug 2022 6:39 AM GMT
Next Story