Telugu Global
Cinema & Entertainment

Indian 3 | భారతీయుడు-3 కూడా వస్తోంది..!

Indian 3 - ఇండియన్-2కు సీక్వెల్ గా ఇండియన్-3 కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

Indian 3 | భారతీయుడు-3 కూడా వస్తోంది..!
X

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తోంది ఇండియన్-2 సినిమా. దశాబ్దాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో సినిమా రావడం, పైగా అది సీక్వెల్ కావడంతో దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఇండియన్-3 సినిమాను కూడా గతంలోనే ఎనౌన్స్ చేశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చారు.

ఇండియన్-2 సినిమాతో పాటు ఇండియన్-3 సినిమా షూటింగ్ కూడా పూర్తిచేశారంట. కాకపోతే కొంత ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ లో ఉందంట. ఇండియన్-2 రిలీజైన 6 నెలల్లోపే ఇండియన్-3 కూడా మార్కెట్లోకి వస్తుందని స్వయంగా దర్శకుడు శంకర్ ప్రకటించడం విశేషం.

ఇండియన్-2 సినిమాను జులైలో విడుదల చేయబోతున్నారు. అంటే.. ఇండియన్-3 సినిమా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి థియేటర్లలోకి వస్తుందన్నమాట.

సేనాపతి పాత్రలో కమల్ నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సిద్దార్థ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. త్వరలోనే మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి.

First Published:  19 May 2024 8:48 AM GMT
Next Story