Telugu Global
Cinema & Entertainment

Pathaan Movie: పఠాన్ లేటెస్ట్ కలెక్షన్లు

Shahrukh's Pathaan Movie - షారూక్ హీరోగా నటించిన పఠాన్ మూవీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడు రికార్డులన్నీ ఈ సినిమావే.

Pathaan Movie: దేశమేంటో చూపిస్తున్న పఠాన్!
X

Pathaan Movie: దేశమేంటో చూపిస్తున్న పఠాన్!

షారూక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా బాలీవుడ్ కరువు తీర్చింది. స్లంప్ లో ఉందంటూ విమర్శలు మూటగట్టుకున్న బాలీవుడ్, పఠాన్ తో ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన పనైపోయిందంటూ ఇన్నాళ్లూ విమర్శలు చేసిన చాలామందికి, పఠాన్ తో తిరుగులేని సమాధానం చెప్పాడు షారూక్ ఖాన్

రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా, విడుదల తర్వాత మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ 832 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓ హిందీ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి.

అంతేకాదు, ఇండియాలో 500 కోట్ల రూపాయల గ్రాస్ దాటిన తొలి బాలీవుడ్ సినిమాగా పఠాన్ రికార్డ్ సృష్టింది. ఇప్పటివరకు బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 మాత్రమే ఈ ఘనత సాధించగా.. తొలి హిందీ చిత్రంగా పఠాన్ ఆ లిస్ట్ లోకి చేరింది.

షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. దీపిక పదుకోన్ హీరోయిన్ గా , జాన్ అబ్రహాం కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాతో షారూక్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

First Published:  7 Feb 2023 4:22 AM GMT
Next Story