Telugu Global
Cinema & Entertainment

Dunki - సలార్ తో పోలిస్తే సగానికి తగ్గిన డంకీ

Dunki - ఓవైపు సలార్ సినిమా రూ.500 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇటు డంకీ అందులో సగం కలెక్ట్ చేసింది.

Dunki - సలార్ తో పోలిస్తే సగానికి తగ్గిన డంకీ
X

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన సినిమా ‘డంకీ’. ప్రపంచవ్యాప్తంగా షారూక్ అభిమానులను ఆకట్టుకుంటంది ఈ సినిమా. ఈ క్రమంలో భారీ వసూళ్లు రాబడుతోంది.

డంకీ సినిమాకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇండియాలో రూ.150 కోట్ల వసూళ్లను సాధించింది డంకీ. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా ఒకే ఒక భాషలోనే ఈ వసూళ్లు రావటం విశేషం.

‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ పై రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే ఈ ఏడాది షారూక్ నటించిన చిత్రాల్లో నిరాశపరిచిన సినిమా మాత్రం ఇదే. ఇంతకుముందు షారూక్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది అత్యథిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా అవతరించింది. అంతకంటే ముందు రిలీజైన పఠాన్ సినిమా కూడా భారీ వసూళ్లు సాధించింది. ఆ రెండు సినిమాలతో పోలిస్తే, డంకీ వెనకబడింది.

First Published:  28 Dec 2023 3:38 PM GMT
Next Story