Telugu Global
Cinema & Entertainment

Jawan Movie | షారూక్ ఎందుకు గుండుతో కనిపించాడు?

Shahrukh Jawan Movie - జవాన్ మూవీలో గుండుతో కనిపించాడు షారూక్. అయితే అది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటున్నాడు.

Jawan Movie | షారూక్ ఎందుకు గుండుతో కనిపించాడు?
X

జవాన్ సినిమా ట్రయిలర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో గుండుతో కనిపించాడు షారూక్. అతడ్ని గుండు లుక్ లో చూసి అంతా షాక్ అయ్యారు. ఎట్టకేలకు తన లుక్ పై స్పందించాడు షారూక్.

"జ‌వాన్ సినిమాలో నేను గుండుతో క‌నిపించ‌టం చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప‌ఠాన్ సినిమాలో పొడ‌వాటి జుట్టుతో న‌టించాను. ఆ వెంట‌నే చేసిన జ‌వాన్ మూవీలో గుండు లుక్‌తో న‌టించాను. ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందోన‌ని ఎదురు చూస్తున్నాను."

ఇలా తన గుండు లుక్ పై స్పందించాడు షారూక్. కేవలం గుండు లుక్ మాత్రమే కాదని.. సినిమాలో తన నుంచి మరికొన్ని షేడ్స్ కూడా చూస్తారని అంటున్నాడు కింగ్ ఖాన్.

"జ‌వాన్‌లో చాలా లుక్స్‌, చాలా షేడ్స్ చేశాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాం. అయితే సినిమాను ఫైన‌ల్‌గా చూసిన త‌ర్వాత‌ అంద‌రూ ఎంజాయ్ చేశారు. ఈ సినిమాను ఎన్నిసార్లు చూడాలని కొందరు అడుగుతున్నారు. ఓసారి మ‌న‌సు కోసం, ఓసారి త‌నువు కోసం, ఓ సారి ఫ‌న్ కోసం, నా అభిమాని అయితే నా కోసం ఓసారి.. ఇలా మొత్తంగా 4 సార్లు జవాన్ సినిమా చూడండి"

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది జవాన్ సినిమా. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కింగ్ ఖాన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో, అఁచనాలు భారీగా ఉన్నాయి. నయనతార ఇందులో హీరోయిన్ గా నటించగా, కీలక పాత్రలో దీపిక పదుకోన్ కనిపించనుంది.

First Published:  28 Aug 2023 5:32 PM GMT
Next Story