Telugu Global
Cinema & Entertainment

Shahrukh Rajini | షారూక్ ఖాన్, రజనీకాంత్ మల్టీస్టారర్?

Shahrukh Khan, Rajinikanth - షారూక్, రజనీ కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారా? ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.

Shahrukh Rajini | షారూక్ ఖాన్, రజనీకాంత్ మల్టీస్టారర్?
X

ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ బజ్ ఏంటంటే, సూపర్ స్టార్స్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించనున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్, రజనీకాంత్ సహకారంతో ఈ చిత్రాన్ని పూర్తిచేయాలని లోకేష్ భావిస్తున్నాడట.

రజనీతో తను చేయబోయే చిత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుందని, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాదని ఇదివరకే దర్శకుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే సినిమాలో నటీనటుల ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నాడు. ఇప్పుడు బజ్ ఏమిటంటే, ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. షారూక్ పాత్ర, నిడివి గురించి వివరాలు బయటకురాలేదు.

దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ఇది వర్కవుట్ అయితే, భారతీయ సినీ చరిత్రలోనే క్రేజీ కాంబినేషన్ అవుతుంది. షారూక్-రజనీ కాంబో అంటే మామూలుగా ఉండదు.

లియో సక్సెస్ అయిన వెంటనే సూపర్‌స్టార్ రజనీకాంత్ తో సినిమా ప్రకటించాడు లోకేష్ కనగరాజ్‌. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. కెరీర్ లో రజనీకాంత్ కు ఇది 171వ చిత్రం. అటు బాలీవుడ్ లో షారూక్ ఖాన్, ఇటు కోలీవుడ్ లో రజనీ నంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి ఇద్దరు హీరోలు కలిస్తే, ఇంతకంటే క్రేజీ ప్రాజెక్ట్ ఏముంటుంది?

First Published:  13 Dec 2023 5:15 PM GMT
Next Story