Telugu Global
Cinema & Entertainment

Dunki | డంకీ కోసం విదేశాల నుంచి స్వదేశానికి షారూక్ ఫ్యాన్స్

Dunki Movie - వరుస విజయాలతో ఊపుమీదున్నాడు షారూక్. దీంతో డంకీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా చూసేందుకు విదేశాల నుంచి స్వదేశానికి వస్తున్నారు షారూక్ ఫ్యాన్స్.

Dunki | డంకీ కోసం విదేశాల నుంచి స్వదేశానికి షారూక్ ఫ్యాన్స్
X

షారూక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది షారూక్ ఖాన్ అభిమానులు డిసెంబర్ నెలలో ఈ సినిమాను తమ మాతృదేశమైన భారత్‌లో చూడటానికి ఇక్కడకు వస్తుండటం విశేషం.

డంకీ సినిమాలో విజువల్స్, భావోద్వేగాలు విదేశాల్లోని వారికి తమ మాతృదేశానికి సంబంధించిన మధుర స్మృతులను గుర్తుకు తెస్తాయి. దీంతో వారు తమ కుటుంబాలు, సన్నిహితులతో కలిసి ఈ క్రిస్మస్ పండుగ సీజన్‌లో డంకీ సినిమాను చూసి ఆ అనుభూతిని పొందాలనుకుంటున్నారు.

ఈ సినిమాలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, షారూక్ పాత్ర తన ప్రియమైన వారి కోసం సరిహద్దులు దాటుతుంది. సరిహద్దులను దాటటానికి అక్రమమైన మార్గాలను సైతం ఎంచుకుంటుంది. కానీ రియల్ లైఫ్ లో షారూక్ అభిమానులు మాత్రం సరిహద్దులను దాటటానికి చట్టబద్దమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇష్టమైన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లాలనేది సినిమా మెయిన్ థీమ్. అదే సెంటిమెంట్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. నేపాల్, కెనడా, అమెరియా, ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి దాదాపు 500 మందికి పైగా అభిమానులు డంకీ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసేందుకు ఇండియాకు వస్తున్నారు. ఇది నిజంగా చాలా అరుదైన సందర్భం అంటున్నారు డంకీ మేకర్స్.

First Published:  30 Nov 2023 4:20 PM GMT
Next Story