Telugu Global
Cinema & Entertainment

Jawan | అరుదైన రికార్డ్ సృష్టించిన షారూక్

Shahrukh Jawan - జవాన్ సినిమాతో తిరుగులేని రికార్డ్ సృష్టించాడు షారూక్ ఖాన్. ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది.

Jawan | అరుదైన రికార్డ్ సృష్టించిన షారూక్
X

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డ్ ను క్రియేట్ చేశాడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. ఈ అరుదైన రికార్డును ఆయన ఒకే ఏడాదిలోనే సాధించటం విశేషం.

‘జవాన్’ సినిమాతో వరుసగా రెండో సారి టాప్ గ్రాసర్ సాధించిన హీరోగా ఆయన నిలిచారు. అంతే కాకుండా రూ.600 కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి సినిమాగా జవాన్ రికార్డ్ సృష్టించింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ సూపర్బ్ కలెక్షన్స్‌ను సాధిస్తూ దూసుకెళ్తోంది. శుక్రవారం జవాన్ సినిమా హిందీ చలన చిత్ర చరిత్రలో టాప్ గ్రాసర్ మూవీగా హిస్టరీని క్రియేట్ చేసి ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది.

రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిన జవాన్ సినిమా విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ వసూళ్లను సాధిస్తూ హిస్టరీ అనే పదానికి పర్యాయపదంగా నిలుస్తోంది. హిందీ సినిమాల పరంగా రూ.525.50 కోట్లు, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.584.32 కోట్లను సాధించిన జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1043.21 కోట్లు వసూళ్లను రాబట్టి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ భారీ కలెక్షన్స్‌ను ఈ చిత్రం కేవలం 22 రోజుల్లోనే సాధించటం విశేషం.

ప్రతీ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ వాటి ప్రభావం జవాన్ సినిమాపై పడలేదు. మూడు వారాలవుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆదరణతో పాటు ప్రశంసలను అందుకుంటోందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ పెట్టిన తర్వాత మూవీకి ఆక్యుపెన్సీ మరింత పెరిగింది.

First Published:  29 Sep 2023 5:23 PM GMT
Next Story