Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హవా.. సూపర్ హిట్ సినిమాలకి సిద్ధమవుతున్న సీక్వెల్స్..

ఇక త్వరలో కూడా చాలానే బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ 2 ప్లాన్స్ కూడా ఉన్నాయని రాజమౌళి ఇప్పటికే చెప్పేశారు. మరోవైపు అఖండ సినిమాకి కూడా సీక్వెల్ ప్రకటించారు బాలకృష్ణ.

Sequels are being prepared for super hit movies in Tollywood
X

టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హవా.. సూపర్ హిట్ సినిమాలకి సిద్ధమవుతున్న సీక్వెల్స్..

కొంతకాలం క్రితం వరకు టాలీవుడ్ లో సీక్వెల్స్ చాలా వరకు ఫ్లాప్ అయ్యేవి. ఆర్య, గబ్బర్ సింగ్, సత్య, గాయం, కిక్, చంద్రముఖి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్ విడుదలయ్యాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. అయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన "బాహుబలి" సీక్వెల్ నుంచి పరిస్థితులు మారాయని చెప్పుకోవాలి.

బాహుబలి రెండవ భాగం బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్యాన్ ఇండియా మార్కెట్లో కూడా "బాహుబలి 2" సినిమా టాలీవుడ్ పేరు ప్రతిష్టలను నిలబెట్టింది. ఈ మధ్యనే విడుదలైన "కేజిఎఫ్: చాప్టర్ 2" కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నిన్న కాక మొన్న విడుదలైన "హిట్ 2" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కార్తికేయ 2 కూడా సూపర్ హిట్ అయింది.

ఇక త్వరలో కూడా చాలానే బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ 2 ప్లాన్స్ కూడా ఉన్నాయని రాజమౌళి ఇప్పటికే చెప్పేశారు. మరోవైపు అఖండ సినిమాకి కూడా సీక్వెల్ ప్రకటించారు బాలకృష్ణ. అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాకి కూడా సీక్వెల్ సిద్ధమవుతోంది. యువ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా డీజే టిల్లు కి కూడా సీక్వెల్ త్వరలోనే విడుదల కాబోతోంది.

చూస్తూ ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ ల హవా బాగా నడుస్తోందని చెప్పుకోవచ్చు. వరుసగా విడుదలైన అన్ని సీక్వెల్స్ ఒకదాని తర్వాత మరొకటి బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నడంతో మరికొన్ని సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్స్ రావటం మొదలైంది. మరి త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సీక్వెల్స్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాయో వేచి చూడాలి.

First Published:  11 Dec 2022 8:40 AM GMT
Next Story