Telugu Global
Cinema & Entertainment

Jigarthanda: సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్

Jigarthanda movie: సౌత్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది.

Jigarthanda: సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్
X

జిగర్ తండా.. 2014లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. తర్వాత ఇదే సినిమా తెలుగులో గద్దలకొండ గణేశ్ గా రీమేక్ కూడా అయింది. ఇలా సౌత్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది.


కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న చిత్రం 'జిగర్‌తండా 2'. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న‌ాయి.


యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న 'జిగర్ తండా 2'లో రాఘవ లారెన్స్, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఈసారి ఈ సినిమాను ఒకేసారి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందించ‌నున్నారు.


ఇంత‌కు ముందు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మెర్క్యురీ, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ పేట్ట స‌హా ప‌లు చిత్రాల‌కు అద్బుత‌మైన విజువ‌ల్స్ అందించిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు.. జిగ‌ర్‌తండా 2కి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే జిగ‌ర్‌తండా సినిమాకు అమేజింగ్ మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయ‌ణ‌న్ జిగ‌ర్ తండా 2కి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  12 Dec 2022 2:27 PM GMT
Next Story