Telugu Global
Cinema & Entertainment

Malli Pelli - సీనియర్ నరేష్ కొత్త సినిమా పేరు ఇదే

Senior Naresh - సీనియర్ నరేష్ కొత్త సినిమా చేస్తున్నాడు. అతడే హీరో. ఆ సినిమా పేరు 'మళ్లీ పెళ్లి'.

Malli Pelli - సీనియర్ నరేష్ కొత్త సినిమా పేరు ఇదే
X

సీనియర్ నరేష్ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ కు జోడిగా పవిత్రా లోకేష్ నటిస్తున్నారు. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తుండగా, నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంతో విజయ కృష్ణ మూవీస్‌ బ్యానర్ ను పున:ప్రారంభించారు నరేష్.

ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో ఓ అందమైన ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గు వేస్తుండగా సాంప్రదాయ దుస్తులలో నరేష్ ఆ ముగ్గు వేయడాన్ని ఆనందంగా చూస్తూ కనిపించారు.

ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. నరేష్ , పవిత్ర అందమైన కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఆకర్షణీయంగా ఉంది. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అనౌన్స్ చేశారు.



First Published:  26 March 2023 7:00 AM GMT
Next Story