Telugu Global
Cinema & Entertainment

యాక్షన్ కింగ్ అర్జున్ కు మాతృవియోగం

అర్జున్ సజ్జ తల్లి ఈరోజు కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. ఆమె ఓ రిటైర్డ్ స్కూల్ టీచర్.

యాక్షన్ కింగ్ అర్జున్ కు మాతృవియోగం
X

హీరో, దర్శకుడు, నిర్మాత అర్జున్ సజ్జ జీవితంలో తీరని లోటు. ఆయన తల్లి లక్ష్మీ దేవమ్మ కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అర్జున్ ను సినిమాల వైపు ప్రోత్సహించింది ఆమె తల్లే. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో అర్జున్ చెప్పుకొచ్చారు.

చిన్నప్పట్నుంచి తల్లిచాటు బిడ్డగా పెరిగానని, తనకు ఏం కావలన్నా తల్లినే అడిగేవాడినని అర్జున్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తనకు సినిమాలపై ఆసక్తి పెరగడానికి, సినిమాల వైపు అడుగులు వేయడానికి తన తల్లి కారణమని, ఆమె ఇచ్చిన ప్రోత్సహమే తనను ఇంతడివాడ్ని చేసిందని చెప్పేవారు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహాన్నే, తను కూడా కొనసాగించానని, తన కూతుర్ని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశానని పలుమార్లు చెప్పుకున్నారాయన.

అలా తల్లితో ఎనలేని అనుబంధాన్ని పెనవేసుకున్నారు అర్జున్. 85 ఏళ్ల లక్ష్మీ దేవమ్మ, వయసురీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో బెంగళూరులోని అపోలో హాస్పిటల్ లో చేశారు. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం అర్జున్, తెలుగులో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమా ఈమధ్య లాంచ్ అయింది. ఇందులో విశ్వక్ సరసన అర్జున్ తనయ ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకిదే తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ. అర్జున్ ఈ పనుల్లో బిజీగా ఉంటుండగానే, ఆయన తల్లి ఈ లోకాన్ని వీడారు.

First Published:  23 July 2022 8:41 AM GMT
Next Story