Telugu Global
Cinema & Entertainment

Das Ka Dhamki - విశ్వక్ సేన్ సినిమా నుంచి మరో ట్రయిలర్

Das Ka Dhamki - దాస్ కా ధమ్కీ సినిమా నుంచి ఇప్పటికే ఓ ట్రయిలర్ పెద్ద హిట్టయింది. ఇప్పుడు రెండో ట్రయిలర్ రిలీజ్ చేస్తున్నారు.

Das Ka Dhamki - విశ్వక్ సేన్ సినిమా నుంచి మరో ట్రయిలర్
X

విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాకు విశ్వక్ దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సినిమాలో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. మార్చి 22న ధమ్కీ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మరో ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు.

దాస్ కా ధమ్కీ’ 2.0 ట్రైలర్ ని రేపు కరీంనగర్ లోని మార్క్ఫెడ్ గ్రౌండ్, రామ్ నగర్ లో జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ విశ్వక్ సేన్ క్లాస్, మాస్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశాడు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా, ఆల్రెడీ 2 పాటలు పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు.

First Published:  11 March 2023 3:00 AM GMT
Next Story