Telugu Global
Cinema & Entertainment

Salaar - ప్రభాస్ సినిమా నుంచి రెండో ట్రయిలర్ వస్తోంది

Salaar - ప్రభాస్ హీరోగా నటించిన సలార్ నుంచి ఇప్పటికే ఓ ట్రయిలర్ రిలీజైంది. ఇప్పుడు రెండో ట్రయిలర్ కూడా రెడీ అయింది.

Salaar - ప్రభాస్ సినిమా నుంచి రెండో ట్రయిలర్ వస్తోంది
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇది కేజీఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టింది. 24 గంటల్లో 110 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. సలార్ నుంచి రెండో ట్రయిలర్ రాబోతోంది.

సాలార్ మొదటి ట్రైలర్ లో స్టోరీపై దృష్టిపెట్టారు. 2 నిమిషాల తర్వాత మాత్రమే ప్రభాస్ వచ్చాడు. రెండో ట్రయిలర్ లో మాత్రం ప్రభాస్ పూర్తిస్థాయిలో కనిపిస్తాడు. పక్కా యాక్షన్ చూపించబోతున్నారు. ఈ ట్రయిలర్ ను డిసెంబర్ 16న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఇండియన్ బాక్సాఫీస్ కు ఈ ఏడాది ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమాగా సలార్ ను చూస్తున్నారు. భారీ అంచనాలున్నాలతో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు లాంటి స్టార్ కాస్ట్ అదనపు బలం. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

సినిమాకు పోటీగా ఇప్పటికే షారూక్ నటించిన డంకీ రెడీగా ఉంది. అయినప్పటికీ యాక్షన్ మూవీ కావడంతో ప్రభాస్ సినిమానే పైచేయి సాధిస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. 22వ తేదీన థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ. ప్రచారానికి సంబంధించి ప్రభాస్ ఇంకా రంగంలోకి దిగలేదు.

First Published:  3 Dec 2023 1:08 PM GMT
Next Story