Telugu Global
Cinema & Entertainment

Tenant | సత్యం రాజేష్ నుంచి మరో డిఫరెంట్ మూవీ

Tenant Movie - పొలిమేర-2 సక్సెస్ తర్వాత మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు సత్యం రాజేష్. అతడి తాజా చిత్రం పేరు టెనెంట్.

Tenant | సత్యం రాజేష్ నుంచి మరో డిఫరెంట్ మూవీ
X

పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రజెంట్ జనరేషన్ లో మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా, ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో మేఘా చౌదరి, చందన హీరోయిన్లుగా నటిస్తుండగా... ఎస్తేర్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

First Published:  20 March 2024 2:13 AM GMT
Next Story