Telugu Global
Cinema & Entertainment

SatyaDev: చిరు సినిమాపై కన్నేసిన సత్యదేవ్

SatyaDev: గుర్తుందా శీతాకాలం సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు సత్యదేవ్. ఇదొక రీమేక్ సినిమా. ఇప్పుడీ హీరో మరో రీమేక్ పై మనసు పారేసుకున్నాడు.

SatyaDev: చిరు సినిమాపై కన్నేసిన సత్యదేవ్
X

హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు సత్యదేవ్. యాక్షన్, కామెడీ, లవ్.. ఇలా దాదాపు అన్ని జానర్లు టచ్ చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో రీమేక్ ప్రాజెక్టులు కూడా చేస్తున్నాడు. ఈరోజు రిలీజైన గుర్తుందా శీతాకాలం సినిమా రీమేక్ ప్రాజెక్టే.

ఇదిలా ఉండగా, తన మనసులో ఉన్న డ్రీమ్ రీమేక్ ప్రాజెక్టుపై స్పందించాడు సత్యదేవ్. అదే చంటబ్బాయ్. చిరంజీవి హీరోగా నటించిన చంటబ్బాయ్ సినిమాను రీమేక్ చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు సత్యదేవ్.

జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కింది చంటబ్బాయ్ సినిమా. అందులో ఎంత కామెడీ ఉంటుందో, అంతే ఎమోషన్-సెంటిమెంట్ కూడా ఉంటుంది. అందుకే ఆ సినిమాను రీమేక్ చేయాలనే కోరిక తనకు కలిగిందంటున్నాడు సత్య.

అయితే సత్య కోరిక బాగానే ఉంది కానీ, దాన్ని రీమేక్ చేయడం అంత ఈజీ కాదు. నిజానికి రీమేక్ రైట్స్ తీసుకొని రీమేక్ చేయడం ఈజీనే. కానీ అది చిరంజీవి సినిమా. కేవలం రైట్స్ తీసుకుంటే సరిపోదు. చిరంజీవి ఆశీస్సులు కూడా కావాలి.

First Published:  9 Dec 2022 4:01 AM GMT
Next Story