Telugu Global
Cinema & Entertainment

SatyaDev: తనది తమన్న రేంజ్ కాదంటున్న సత్యదేవ్

Satyadev: గుర్తుందా శీతాకాలం సినిమాలో తమన్నా నటించడం ఇప్పటికీ తనకు షాక్ గా ఉంది అంటున్నాడు సత్యదేవ్.

SatyaDev: తనది తమన్న రేంజ్ కాదంటున్న సత్యదేవ్
X

సత్యదేవ్, తమన్నా జంటగా న‌టించిన సినిమా గుర్తుందా శీతాకాలం. ఓ కన్నడ సినిమాకు రీమేక్ ఇది. కన్నడ మూవీని తెరకెక్కించిన నాగశేఖర్, ఈ తెలుగు సినిమాను కూడా డైరక్ట్ చేశాడు. ఈ సినిమాలో తమన్న నటించిందనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు హీరో సత్యదేవ్.


"నేను కామెడీ, ల‌వ్ స్టోరీస్ బాగానే చేస్తాను క‌దా ఎందుకు నాకు కాన్సెప్ట్ చిత్రాలు, పెద్ద క్యారక్ట‌రైజేష‌న్స్ ఇస్తున్నారు అని కొంచెం అనిపించేది. అలాంటి టైం లో నాగ‌శేఖ‌ర్ నాకు ఈ క‌థ చెప్పాడు, 10 నిమిషాల్లో నేను ఈ సినిమా చేస్తా అని చెప్పా.. కాని నా ప‌క్క‌న హీరోయిన్ ఎవ‌రు చేస్తారు అనుకుంటున్న టైం లో నా మొబైల్ కు ఒక మెసేజ్ వ‌చ్చింది. అప్పుడు త‌మన్న చేస్తున్నార‌ని క‌న్‌ఫ‌ర్మ్ అయింది. ఆ మెసేజ్ చూసి వావ్ అనిపించింది. అందుకే సినిమాలో ఒక డైలాగ్ పెట్టాం. త‌మ‌న్నా ని సినిమా లో చూడ‌గానే ఇది మ‌న రేంజ్ కాదేమోరా అని. అలా చాలా నేచుర‌ల్ గా 3 ల‌వ్ స్టోరీస్ క‌లిపిన ఒక మంచి ల‌వ్ స్టోరీ మా గుర్తుందా శీతాకాలం."


వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్, మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాల‌భైర‌వ సంగీతాన్ని అందించాడు. తమన్నతో పాటు కావ్య శెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది గుర్తుందా శీతాకాలం సినిమా.

First Published:  29 Nov 2022 8:01 AM GMT
Next Story