Telugu Global
Cinema & Entertainment

SatyaDev: సత్యదేవ్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్

Satya Dev's new movie titled as Zebra తన కెరీర్ లో 26వ సినిమా చేస్తున్నాడు సత్యదేవ్. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ లాక్ చేశారు

SatyaDev: సత్యదేవ్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్
X

సత్యదేవ్‌, కన్నడ హీరో డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇదొక క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. సత్యదేవ్ కొత్త సినిమా పేరు జీబ్రా.


‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ లాగే టైటిల్ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇది తప్పకుండా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది.


ప్రిన్స్ సినిమాలో నటించిన ఫారిన్ బ్యూటీ జెనిఫర్ పిచినెటో ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్. వెటరన్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సునీల్ కూడా మరో కీలక పాత్రలో కనిపిస్తాడు.


సినిమాకు సంబంధించి ఇప్పటికే 50 రోజుల షెడ్యూల్‌ పూర్తి చేశారు. మిగిలిన పోర్షన్ ను హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ప్రాంతాల్లో పూర్తి చేస్తారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ని ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల చేస్తారు.

First Published:  27 Jan 2023 2:01 PM GMT
Next Story