Telugu Global
Cinema & Entertainment

Katha Keli | తెలుగుతెరపై సరికొత్త కథాకేళి

Katha Keli Movie - సతీశ్ వేగేశ్న కొత్త సినిమా కథా కేళి. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం..

Katha Keli | తెలుగుతెరపై సరికొత్త కథాకేళి
X

సతీశ్ వేగేశ్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ‘కథా కేళి’ చిత్రంతో తన కొడుకు యశ్విన్‌ను హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ టీజర్‌ను దిల్ రాజు లాంచ్ చేయగా.. అది బాగా క్లిక్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

సతీశ్ వేగేశ్న ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశాడు. చిత్రయూనిట్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. ఇక చివరి రోజున ఇలా చిత్రయూనిట్ అంతా కూడా సందడిగా కనిపించారు. ఈ మేరకు మేకర్స్ షేర్ చేసిన ఫోటోల్లో చిత్రయూనిట్ సంతోషంగా కనిపించింది.

ఈ చిత్రానికి ఎస్‌.కె.బాల‌చంద్ర‌న్‌ సంగీతం అందిస్తున్నారు. దాము న‌ర్రావుల‌ కెమెరామెన్‌గా, మ‌ధు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాను దిల్ రాజు సహకారంతో, థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

First Published:  10 Feb 2024 11:08 AM GMT
Next Story