Telugu Global
Cinema & Entertainment

షూటింగ్ పూర్తి చేసుకున్న 'శశివదనే'

రక్షిత్ హీరో గా నటించిన మూవీ శశి వదనే. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న శశివదనే
X

ఎస్‌విఎస్‌ కన్‌స్ట్రక్షన్స్, ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా శశివదనే. రఘు కుంచె , ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం లో అహితేజ బెల్లంకొండ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.


గోదావరి బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న శశివదనే సినిమాను కోనసీమలోని అందమైన లొకేషన్లలో 50 రోజుల పాటు షూటింగ్ చేశారు. మరో 3 రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది.

గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు ప్రేమకథలు, డ్రామాలు మాత్రమే వచ్చాయి. తొలిసారి గోదావరి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీ చేశామంటున్నాడు నిర్మాత అహితేజ. అంతేకాదు.. గోదావరి అందాల్ని కూడా ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని విధంగా చూపించామంటున్నాడు.


శశివదనే సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. త్వరలోనే మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేసి, విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  18 Oct 2022 12:00 PM GMT
Next Story