Telugu Global
Cinema & Entertainment

Saripodhaa Sanivaaram | నాని సినిమా అప్ డేట్స్

Saripodhaa Sanivaaram - నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ మూవీ నుంచి ఒకేసారి 2 అప్ డేట్స్ వచ్చాయి. అవేంటో చూద్దాం..

Saripodhaa Sanivaaram | నాని సినిమా అప్ డేట్స్
X

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నానిని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యుల్ లో ఎస్ జే సూర్య జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర డైనమిక్ గా ఉండబోతుంది.

ఇప్పటికే విడుదలైన సరిపోదా శనివారం వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని, మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడు.

పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. హాయ్ నాన్న తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇదే.

First Published:  20 Jan 2024 5:09 PM GMT
Next Story