Telugu Global
Cinema & Entertainment

Saripodhaa Sanivaaram | నాని సినిమా షూటింగ్ అప్ డేట్స్

Saripodhaa Sanivaaram - నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సరిపోదా శనివారం. ఈ మూవీ షూట్ ఎంత వరకు వచ్చింది?

Saripodhaa Sanivaaram | నాని సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోద శనివారం'లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్వంచరస్ మూవీని భారీ కాన్వాస్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా చిత్ర బృందం క్లైమాక్స్‌ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ నిర్మించారు.

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. మురళి జి డివోపీగా పని చేస్తున్నాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. ఇంతకుముందు నాని-వివేక్ కాంబోలో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. దానికి పూర్తి భిన్నమైన చిత్రమిది.


First Published:  14 May 2024 6:19 PM GMT
Next Story