Telugu Global
Cinema & Entertainment

OTT Movies: ఇటు సర్దార్.. అటు సీతారామం

OTT Movies: కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమా ఓటీటీలోకొచ్చింది. అటు దుల్కర్ నటించిన సీతారామం సినిమా హిందీ వెర్షన్ కూడా ఈరోజే ఓటీటీలో ప్రత్యక్షమైంది.

OTT Movies: ఇటు సర్దార్.. అటు సీతారామం
X

థియేట్రికల్ రిలీజెస్ తో పాటు ఓటీటీ విడుదలలు కూడా ఎక్కువయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు థియేటర్లలోకి మసూద లాంటి సినిమాలొస్తే, అటు ఓటీటీలోకి సర్దార్, సీతారామం సినిమాలొచ్చాయి. ఇలా ఒకేసారి రెండు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షం కావడంతో అందరి దృష్టి దానిపై పడింది.

సర్దార్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చింది. తాజాగా ఓరి దేవుడా సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు సర్దార్ తో తన రీచ్ ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. థియేటర్లలో సూపర్ హిట్టయిన ఈ సినిమా, ఓటీటీలో ఏ మేరకు ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. కార్తి హీరోగా నటించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.

ఇక మరో సూపర్ హిట్ మూవీ సీతారామం కూడా ఓటీటీలోకొచ్చింది. నిజానికి ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆల్రెడీ ఓటీటీలో ఉంది. కాకపోతే హిందీ వెర్షన్ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ వెయిటింగ్. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరింది. సీతారామం హిందీ వెర్షన్ ఓటీటీలో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది.

నార్త్ బెల్ట్ మొత్తం ఈ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ కోసం వెయిటింగ్. అలా భారీ అంచనాల మధ్య సీతారామం హిందీ వెర్షన్, ఇటు తెలుగులో సర్దార్ స్ట్రీమింగ్ కు రావడంతో.. ఓటీటీ స్పేస్ లో చిన్నపాటి సందడి వాతావరణం కనిపిస్తోంది.

First Published:  18 Nov 2022 10:49 AM GMT
Next Story