Telugu Global
Cinema & Entertainment

సర్దార్ సినిమాకు సీక్వెల్.. క్రేజీగా ప్రకటన

కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ కానుంది. వీడియో రిలీజ్ చేసి మరీ ప్రకటన చేశారు.

Sardar Movie Review: ‘సర్దార్’ మూవీ రివ్యూ
X

Sardar Movie Review: ‘సర్దార్’ మూవీ రివ్యూ 

హీరో కార్తి, దర్శకుడు మిత్రన్ ల తాజా చిత్రం సర్దార్. తెలుగు-తమిళంలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టయింది ఈ సినిమా. రెండు భాషల్లో దీపావళి విజేతగా నిలిచింది. రాశి ఖన్నా, రజిషా విజయన్, లైలా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్రకటన వచ్చేసింది.

సర్దార్ పార్ట్ 2 ప్రకటన ఇచ్చింది యూనిట్. ఈరోజు టీమ్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. సర్దార్ సీక్వెల్ ఉంటుంది, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేశారు.

కార్తీ పోషించిన సర్దార్ కొడుకు పాత్రను రా ఏజెంట్‌గా చేరమని ఆఫర్ చేయగా అతను అంగీకరించాడు. నెక్స్ట్ మిషన్ కాంబోడియాలో మొదలవుతుంది. ఇది ఆ వీడియో సారాంశం. సర్దార్ కోసం పనిచేసిన అదే టీమ్ సర్దార్ 2కి కూడా వర్క్ చేస్తుంది.

సర్దార్ లో కార్తి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కార్తి విలక్షణమైన నటన ప్రేక్షకులతో పాటు విమర్శకుల్ని ఆకట్టుకుంది. దర్శకుడు మిత్రన్ బ్రిలియంట్ కంటెంట్ తో మెస్మరైజ్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రానున్న ఈ సీక్వెల్ క్రేజీ ప్రాజెక్ట్ గా ప్రేక్షకులని అలరించబోతుంది.



First Published:  26 Oct 2022 3:14 PM GMT
Next Story