Telugu Global
Cinema & Entertainment

Sarath Babu Last Movie: శరత్ బాబు పోషించిన చివరి పాత్ర ఇదే

Sarath Babu Last Movie: కెరీర్ లో శరత్ బాబు పోషించిన ఆఖరి రోల్ చిరస్మరణీయం. సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో ఆయన కనిపించారు.

Sarath Babu Last Movie: శరత్ బాబు పోషించిన చివరి పాత్ర ఇదే
X

Sarath Babu Last Movie: శరత్ బాబు పోషించిన చివరి పాత్ర ఇదే

సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కెరీర్ లో 220కి పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. ఆయన చివరి సినిమా మళ్లీ పెళ్లి.

సీనియర్ నటుడు నరేష్ హీరోగా తెరకెక్కింది మళ్లీ పెళ్లి సినిమా. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శరత్ బాబు కీలకమైన పాత్ర పోషించాడు. నరేష్ తండ్రిగా, సూపర్ స్టార్ కృష్ణ పాత్రను ఆయన పోషించారు. అలా తన కెరీర్ ను, జీవితాన్ని ఓ ప్రత్యేకమైన పాత్రతో ముగించారు శరత్ బాబు

మళ్లీ పెళ్లి సినిమాకు సంబంధించి ఇప్పటికే ట్రయిలర్ రిలీజైంది. అందులో నరేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు, తల్లి విజయనిర్మల పాత్రలో జయసుధ కనిపించారు. ట్రయిలర్ లో శరత్ బాబు లుక్స్ కూడా బాగున్నాయి.

ఈ సినిమా తర్వాత మళ్లీ ఆయన మరో సినిమా అంగీకరించలేదు. దాదాపు నెల రోజులుగా ఆయన హాస్పిటల్ కే పరిమితమయ్యారు. పలు శరీర అవయవాలు దెబ్బతినడంతో.. ఏప్రిల్ 20 నుంచి ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు తుదిశ్వాస విడిచారు.

First Published:  22 May 2023 10:50 AM GMT
Next Story