Telugu Global
Cinema & Entertainment

Sapta Sagaralu Daati | తెలుగుతెరపైకి మరో కన్నడ మూవీ

Sapta Sagaralu Daati - రక్షిత్ శెట్టి మరో సినిమా రెడీ చేశాడు. ఈ సినిమా కూడా తెలుగులో హిట్టవుతుందని భావిస్తున్నాడు.

Sapta Sagaralu Daati | తెలుగుతెరపైకి మరో కన్నడ మూవీ
X

కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. 'అతడే శ్రీమన్నారాయణ', '777 చార్లీ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు.

సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రయిలర్ రిలీజ్ చేశారు. ‘సప్త సాగరాలు దాటి’ చిత్ర ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు.

ట్రయిలర్ చూస్తే, రక్షిత్ శెట్టి మరోసారి ఎమోషనల్ సబ్జెక్ట్ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. హీరో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది. హీరోపై తన ప్రేమను సముద్రంతో పోలుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరో ఓ కేసులో జైలుకు వెళ్తాడు. అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. హీరో జైలు నుంచి తప్పించుకున్నాడా, తన ప్రేయసిని కలిశాడా, చివరికి ఏమైంది అనేది ఈ సినిమా.

ప్రేమ మనిషి చేత ఎంత తప్పయినా చేయిస్తుంది, ఎంత సాహసమైనా చేయనిస్తుంది. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే.. సప్త సముద్రాలు అంత ఉండటమే కాదు, దాని ఆవల కూడా ఉందని చెప్పిన సినిమా ఇది. ఒక్క రిస్క్ వల్ల ఎంతమంది జీవితాలు ప్రభావితం అయ్యయో ఎంతో వివరంగా చూపించారు. ప్రతి షాట్ లోనూ కథ చెప్పారు. ఒక్క షాట్ మిస్ అయితే కథ ఏమైనా మిస్ అవుతాం అనిపించేలా ఉంటుందంట ఈ సినిమా.

దర్శకుడు హేమంత్ ఈ సినిమాని ఎంతో పొయెటిక్ గా తీశాడనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. ప్రతి ఫ్రేమ్ లో దర్శకత్వ ప్రతిభ కనిపించింది. ఈ సినిమా ఆల్రెడీ కన్నడలో రిలీజైంది. సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతోందనే విషయం కన్నడ ప్రేక్షకులకు తెలిసిపోయింది. అందుకే తెలుగు ప్రమోషన్స్ లో ఆ విషయాన్ని కూడా దాచిపెట్టలేదు. 777-చార్లీ సినిమాతో తెలుగులో కూడా హిట్ కొట్టిన రక్షిత్ శెట్టి, సప్తసాగరాలు దాటి అనే సినిమాతో టాలీవుడ్ లో మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

First Published:  19 Sep 2023 4:40 PM GMT
Next Story