Telugu Global
Cinema & Entertainment

Sankranti Movies: ఓవర్సీస్ లో సంక్రాంతి సినిమాల పరిస్థితి ఇది

Sankranti Movies latest positions in overseas ఓవర్సీస్ లో సంక్రాంతి సినిమాల పరిస్థితి ఏంటి? ఏ సినిమా ముందంజలో ఉంది.

Sankranti Movies: ఓవర్సీస్ లో సంక్రాంతి సినిమాల పరిస్థితి ఇది
X

తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఓవర్సీస్ లో సంక్రాంతి సినిమాల మధ్య పోటీ నడిచింది. కల్యాణం కమనీయం సినిమాని పక్కనపెడితే.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు సినిమాల మధ్య మంచి పోటీ నడిచింది. ఈ రేసులో ఏ సినిమా ఏ పొజిషన్ లో ఉందో చూద్దాం..


చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా యూఎస్ లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమాకు తాజాగా 1.7 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇకపై ఈ సినిమాకు వచ్చే ప్రతి డాలర్ లాభం కిందే లెక్క.


మొదటి రోజు భారీగా వసూళ్లు సాధించిన వీరసింహారెడ్డి సినిమా రెండో రోజుకు పడిపోయింది. ప్రస్తుతం యూఎస్ బాక్సాఫీస్ లో ఈ సినిమా స్ట్రగుల్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు కష్టం అంటోంది ట్రేడ్. అదే కనుక జరిగితే బాలయ్యకు ఓవర్సీస్ లో మరో ఫ్లాప్ తప్పకపోవచ్చు.


ఇక అజిత్ హీరోగా నటించిన తునీవు/తెగింపు సినిమా ఓవర్సీస్ లో సూపర్ హిట్టయింది. ఇప్పటికే లాభాల్లోకి ఎంటరైంది. కాస్త ఆలస్యంగా విడుదలైన వారసుడు సినిమా పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రావాలి.

First Published:  16 Jan 2023 7:19 AM GMT
Next Story