Telugu Global
Cinema & Entertainment

Slum Dog Husband | బ్రహ్మాజీ కొడుకు హీరోగా సినిమా రెడీ

Slum Dog Husband Movie - బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటిస్తున్న సినిమా స్లమ్ డాగ్ హజ్బెండ్. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

Slum Dog Husband | బ్రహ్మాజీ కొడుకు హీరోగా సినిమా రెడీ
X

బ్రహ్మాజీ కొడుకు సినిమాలైతే చేస్తున్నాడు కానీ, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. పిట్టకథ తర్వాత అతడు మళ్లీ మెరవలేదు. మళ్లీ ఇన్నాళ్లకు స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే సినిమా చేశాడు. ఎప్పట్లానే ఈ సినిమాకు కూడా బ్రహ్మాజీ దగ్గరుండి ప్రచారం చేస్తున్నాడు.

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మేరకు రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు.

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ట్రైలర్ స్టార్టింగ్ టు ఎండింగ్ హ్యూమరస్ గా ఉండటం, మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ కొత్త పాయింట్ ను చూపెట్టడం ఆసక్తిని కలిగించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి సకుటుంబ సమేతంగా ప్రేక్షకులు ఈ సినిమాకు రావొచ్చని చెబుతున్నారు మేకర్స్.

బ్రహ్మాజీ, సప్తగిరి, యాదమ్మ రాజు, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ కీ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాలో ఓ కుక్క కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  17 July 2023 9:56 AM GMT
Next Story