Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్?

త్వరలోనే ప్రారంభంకానుంది ప్రభాస్-మారుతి సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ను తీసుకుంటారనే ప్రచారం నడుస్తోంది.

ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్?
X

హెడ్డింగ్ చూడగానే అందరికీ సలార్ సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే, ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేసిన కేజీఎఫ్2లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించాడు సంజయ్ దత్. కాబట్టి సహజంగానే ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ లో కూడా సంజయ్ దత్ ను తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం వేరు.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా కోసం సంజయ్ దత్ పేరును పరిశీలిస్తున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా కోసం సంజయ్ దత్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.

నిజానికి ఈ సినిమా జానర్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. యాక్షన్ మూవీ మాత్రం కాదనే విషయం అందరికీ తెలుసు. మారుతి కూడా ఇదే విషయం స్పష్టంచేశాడు. ప్రభాస్ తో బుజ్జిగాడు, డార్లింగ్ టైపు ఎనర్జిటిక్ మూవీ అని తేల్చేశాడు. అయితే సంజయ్ దత్ పేరు బయటకు రావడంతో, ఇదొక హారర్ కామెడీ సబ్జెక్ట్ అయి ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు.

లెక్కప్రకారం ఈపాటికే ప్రభాస్-మారుతి కాంబోలో సినిమా ప్రకటన రావాల్సి ఉంది. కానీ కృష్ణంరాజు హఠాన్మరణంతో, ఈ ప్రకటనను వాయిదా వేశారు. మరో మంచి టైమ్ చూసి ప్రభాస్-మారుతి సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు.

First Published:  28 Sep 2022 4:22 AM GMT
Next Story