Telugu Global
Cinema & Entertainment

Spirit | ప్రభాస్ మూవీ పై మరింత క్లారిటీ

Spirit Movie - ప్రభాస్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాకు సంబంధించి డీటెయిల్స్ బయటపెట్టాడు దర్శకుడు.

Spirit | ప్రభాస్ మూవీ పై మరింత క్లారిటీ
X

స్పిరిట్ విడుదల తేదీ లాక్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సంతోషకరమైన వార్త ఏమిటంటే స్పిరిట్ విడుదల తేదీ లాక్ అయింది.

స్పిరిట్ 2025 క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. సెప్టెంబరు 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని, ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ, ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ప్రకటించాడు సందీప్.

యానిమల్ ప్రమోషన్ సందర్భంగా సందీప్ వంగా మాట్లాడుతూ యానిమల్ రిలీజ్ అయిన వెంటనే, స్పిరిట్ పనిని ప్రారంభిస్తానని, సెప్టెంబర్ 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పాడు. సందీప్ రెడ్డి వంగా రైటింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. యానిమల్ కోసం దాదాపు 18 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. స్పిరిట్ కోసం మాత్రం అంత టైమ్ తీసుకోనని తెలిపాడు. ఎందుకంటే, ప్రభాస్ కు కథ చెబుతున్నప్పుడే, చాలా సన్నివేశాల ట్రీట్ మెంట్ పూర్తయిపోయిందంట.

కెరీర్ లో తొలిసారి ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. సాహోలో మాఫియా డాన్ గా కనిపించిన ఈ హీరో, ఖాకీ డ్రెస్ లో ఎలా కనిపిస్తాడో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది.

First Published:  29 Nov 2023 4:36 PM GMT
Next Story