Telugu Global
Cinema & Entertainment

Sandeep Vanga | మహేష్ తో సినిమా ఆగిపోలేదంట

Sandeep Vanga - మహేష్ తో చేయాల్సిన సినిమా పేరు డెవిల్. ఈ సినిమా ఆగిపోలేదు. టైమ్ సెట్ అవ్వకపోవడం వల్ల కార్యరూపం దాల్చలేదు.

Sandeep Vanga | మహేష్ తో సినిమా ఆగిపోలేదంట
X

అర్జున్ రెడ్డి హిట్టయిన వెంటనే దర్శకుడు సందీప్ వంగకు మహేష్ నుంచి కాల్ వచ్చింది. సినిమా ఆఫర్ వరించింది. సందీప్ వంగ కూడా దానిపై వర్క్ చేశాడు. కానీ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. సందీప్ అయితే ఏకంగా బాలీవుడ్ కు వెళ్లిపోయాడు.

అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ చేశాడు. తాజాగా రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా చేశాడు. అయితే మహేష్ తో చేయాల్సిన కథనే యానిమల్ గా రణబీర్ తో తీశాడనే చర్చ మొదలైంది. దీనిపై సందీప్ రెడ్డి వంగ స్పందించాడు.

"మహేష్ కు చెప్పిన కథ ఇది కాదు. అతడికి డెవిల్ అనే మరో కథ చెప్పాను. అందులో వయొలెన్స్, ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ కథ అలానే ఉంది. అంతా అనుకుంటున్నట్టు మహేష్ తో సినిమా ఆగిపోలేదు. టైమ్ సెట్ అవ్వక సినిమా కుదరలేదంతే. ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేస్తా."

ఇలా మహేష్ తో చేయాల్సిన సినిమాపై స్పందించాడు సందీప్ వంగ. యానిమల్ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని ప్రకటించాడు. స్పిరిట్ లో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు.

First Published:  28 Nov 2023 2:06 AM GMT
Next Story